బుల్లి తెర పై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ హవా ఓ రేంజ్‌లో ఉంది. అలా సీరియల్, నటీనటులకు క్రేజ్ పీక్స్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అందరూ ట్రై చేస్తున్నట్టున్నారు. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్‌లో తప్పా మరెక్కడా కనిపించని డాక్టర్ బాబు, దీపలు ఇప్పుడు బయట కూడా రచ్చ చేస్తున్నారు.


బిగ్ బాస్ కంటెస్టెంట్లు, తమ సీరియల్ నటీనటులతో స్టార్ మా కొత్త కొత్త షోలను ప్లాన్ చేస్తోంది. ఈ మధ్యే రెండు వారాలు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో షోను ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట రెండు ఆదివారాలు బాగానే ఎంటర్టైన్ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో కొత్త షోతో ముందుకు వచ్చారు.. ఈ షో బిగ్ బాస్ కంటే ఎక్కువగా పాపులర్ అవుతుండటం విశేషం అని చెప్పాలి. రీల్ జంటలు, రియల్ జంటలు అంటూ ఆరు జంటలను కొత్త ప్రోగ్రాంను డిజైన్ చేశారు. 100 పర్సెంట్ లవ్ అంటూ రాబోతోన్న ఈ షోల్లో ప్రభాకర్, నిరుపమ్, అమ్మ రాజశేఖర్ వంటి వారు రియల్ కపుల్స్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ అరియానా, దీప్తి సునయన షణ్ముఖ్ వంటివారు రీల్ కపుల్ లిస్ట్‌లో వచ్చారు...


అయితే ఈ షో లో భార్య తో ఉన్న టైర్ లతో ఎపిసోడ్ మొత్తం సందిగా సాగింది.తన భార్య మీదున్న ప్రేమను కవిత్వం రూపంలో చెప్పేశాడు. మొత్తానికి నిరుపమ్‌లో ఓ కవి కూడా ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది..నిన్ను చూసిన క్షణం నా కళ్లు స్కానర్లా మారిపోయాయ్.. నీ అందాన్ని నా మెదడులో ముద్రించి.. నా గుండెల్లో దాచుకున్నా.. నా పేరు నిరుపమ్.. నా మనసు నిండా నీ రూపమే అంటూ అదిరిపోయేలా చెప్పాడు. తన భార్య మీదున్న ఈ ప్రేమను ఇలా అందంగా మాటల్లో చెప్పేశాడు. ఈ షో ఫిబ్రవరి 21న సాయంత్రం ఆరుగంటలకు ప్రసారం కానుంది.. మొత్తానికి భార్యతో మరోసారి పులిహోర ను కలిపి షో జు అట్రాక్షన్ అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: