
ఇకపోతే ఇప్పటి జనరేషన్ కు కమెడియన్ సుధాకర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వారిని అడిగితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా బాగా నవ్వించిన ఈయన గత కొన్ని సంవత్సరాలలో బయట ఎక్కడ కనిపించలేదు. కానీ ఈమధ్య కొన్ని రోజుల ముందు ఆయన చనిపోయారని ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో మీడియా ముందుకు వచ్చి వాటిని కొట్టి పారేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.
ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో ఫాదర్స్ డే సందర్భంగా నేను నాన్న పేరుతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయగా.. ఈ షో కి ఆర్గనైజర్స్ సుధాకర్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు. 45 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నందుకు గాను ఆయనను సన్మానించి ఆయనతో కేక్ కూడా కట్ చేయించారు. ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ను చూసి చాలామంది మొదట గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీలు, నవ్వించిన సన్నివేశాలను గుర్తుచేసుకొని మరీ సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇకపోతే ఆయన ఆరోగ్యం సరిగా లేదని సన్నగా మారిపోయి మరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారని చెప్పవచ్చు.