టెలివిజన్ లో, పలు రకాల చిత్రాలలో నటించిన నటి అంకిత లోఖండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీ వలే ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని కూడా పంచుకుంది. దక్షిణాది సినిమాల కోసం తనని చాలా మంది సంప్రదించారని.. అయితే అందులో ఒక సినిమాని పొందాలి అంటే నిర్మాత తో పడుకోవాలని చెప్పారని అంకిత వెల్లడించింది.. తాను సౌత్ సినిమా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సినిమా  అమౌంట్ కూడా రిసీవ్ చేసుకోమని తనకి కాల్ వచ్చిందని తెలిపింది..


ఈ విషయం తనకి చాలా సంతోషం అనిపించి తన తల్లికి కూడా చెప్పానని.. అలా ఆ సైన్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్లగా అప్పటికి తన వయసు 19 ఏళ్లే అని.. అక్కడికి వెళ్లిన సమయంలో తన కోఆర్డినేటర్ ని బయట కూర్చోమని చెప్పారని.. తనని మాత్రమే  ఒంటరిగా గదిలోకి పిలిపించి ఇలా చెప్పారని నువ్వు చేయాలి రాజీ అని.. చెప్పారని..ఏంటి రాజీ అని అడగగా.. నిర్మాతతో పడుకోవాలని డైరెక్ట్ గా చెప్పేశారట.. దీంతో వెంటనే అంకిత ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని వెల్లడించింది..


మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటున్నాను అతనికి పడుకోవడానికి ఒక అమ్మాయి మాత్రమే కావాలి.. బయటికి వెళితే చాలామంది దొరుకుతారు.. నేను అలాంటి దాన్ని కాదని చెప్పి వచ్చేసానని వెల్లడించింది.. ఇటీవలే అంకిత తన భర్తతో కలసి విక్కీ జైన్ డాన్స్ దివాన్ అనే రియాల్టీ షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక అక్కడే సెట్ నుంచి ఒక వీడియో పంచుకుంటూ తన కల నిజమైంది అంటూ వెల్లడించింది.. ముఖ్యంగా మాధురి దీక్షిత్ తో కలిసి ఒక పాటను కూడా ప్రదర్శించింది. ఒక అద్భుతమైన వ్యక్తిని కలిశానంటూ ఇది మన హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందంటూ రాసుకుంది ఈ ముద్దు గుమ్మ.ఇమే బిగ్ బాస్-17 లో  ఉండడమే కాకుండా దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు కూడా..

మరింత సమాచారం తెలుసుకోండి: