
అందులో రెండు మూడు చిత్రాలు తప్ప సుదీర్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ ఏవి రాలేదు. దీంతో అవకాశాలు కూడా కనుమరుగవ్వడంతో మళ్లీ బుల్లితెర పైన హోస్టుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది సుధీర్. తాజాగా బుల్లితెరపై మళ్ళీ తన హవా కొనసాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. సుడిగాలి సుదీర్ హోష్టుగా చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షో మరొకసారి మూడవ స్థానంలోకి రావడం జరిగిందట. దీంతో టాప్-10 లో మొత్తం ఈటీవీలోనే ఏడు షోలు పైగా ఉండడం గమనార్హం.
తెలుగులో ప్రసారమవుతున్న టీవీ షో లలో స్టార్ మా ఛానల్ కు చెందిన షోలు టాప్-3లో ఉన్నాయట.. బిగ్బాస్ 8 తెలుగు మొదటి స్థానంలో ఉండగా ఇస్మార్ట్ జోడి షో, ఓంకార్ హోస్టుగా చేస్తున్న ఈ షో టాప్ లో ఉన్నదట. ఆ తర్వాత శ్రీముఖి చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ హవా కూడా బాగానే కొనసాగిస్తున్నదట. అలా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ షోలన్నీ కూడా టాప్ వన్ నుంచి త్రీ లోనే ఉన్నాయట . సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షో మూడో స్థానం లభించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సుడిగాలి సుధీర్ కి వెండితెర కంటే బుల్లితెర పైన బాగా కలిసి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సుధీర్ కూడా వెండితెరకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పూర్తిగా తాను మళ్ళీ బుల్లితెరవైపే అడుగులు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇటీవలే సుదీర్, రష్మీ జోడితో చేసిన షోలు కూడా బాగానే సక్సెస్ అవ్వడంతో అభిమానులు కృషి అవుతున్నారు. మరి సుధీర్ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి.