ప్ర‌స్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకూస్మార్ట్ ఫోన్ ఒక అవసరంగా మారింది. పాత తరం ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం సులువు కావటంతో బాటు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో ఎక్కువ మంది పలు సేవలకు, సమాచార సేకరణకూ స్మార్ట్ ఫోన్ నే ఆశ్రయిస్తున్నారు. కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు తమ ఫోన్‌లో ఈ మార్పులు చేసినట్లయితే పనితీరు ఇంకా బాగుంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా వచ్చే యాప్స్‌లో కొన్నింటి వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. 

 

ఇలాంటి యాప్స్ ఏమైనా మీ ఫోన్‌లో ఉన్నట్లయితే  uninstall లేదా disable చేసేయండి. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే గూగుల్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవటం ఎంతో ముఖ్యం. గూగుల్ అకౌంట్ ను సెటప్ చేయగలిగితేనే గూగుల్ ప్లే స్టోర్ ను మీరు యాక్సిస్ చేసుకోగలుగుతారు. ఫోన్ కొన్నవెంటనే సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్‌ బ్రెట్‌నెస్‌ను తగ్గించుకోవాలి. ఎక్కువ వెలుగుతో కూడిన ఫోన్ తెరను గంటల తరబడి చూడటం మూలంగా కళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. బ్యాటరీ బ్యాకప్ పెంచుదామంటూ బ్యాటరీ బూస్టర్ యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకండి. 

 

ఇలా చేయటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది. ఫోన్ స్ర్కీన్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి. అవసరమైన విడ్జెట్‌లు, నచ్చిన స్ర్కీన్ సేవర్లతో ఫోన్ హోమ్ స్ర్కీన్‌‍ను అందంగా ఉంచుకోండి. అవసరంలేని విడ్జెట్ లను ఫోన్ హోమ్ స్ర్కీన్ నుంచి రిమూవ్ చేయండి. తయారీదారు‌లు ఇన్‌బుల్ట్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను ఫోన్‌లతో పాటు అందిస్తుంటారు. వీటిలో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు నిరుపయోగంగా మారి ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లనే బ్లోట్‌వేర్‌ అని పిలుస్తారు. బ్లోట్‌వేర్‌ను తొలగించటం ద్వారా పోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఖాళీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: