ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ త‌న యూజ‌ర్ల కోసం మ‌రో అదిరిపోయే అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ వారు డిజైన్ చేసిన వెబ్ బ్రౌజ‌ర్ స‌ఫారీలో ఇక నుంచి పాస్‌వర్డ్‌ లేకుండా లోగ్ ఇన్ అవ్వొచ్చు. గత సంవత్సరం వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యుడిసి)లో స‌ఫారీ వెబ్ బ్రౌజర్లో సంబంధిత వెబ్ సైట్ల‌లో లాగ్ ఇన్ చేయడానికి ఐడీ పాస్ వ‌ర్డ్ అవ‌స‌రం లేకుండా ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీని ఉప‌యోగించేలా పని చేస్తున్నామ‌ని ఆపిల్ సంస్థ ప్రకటించింది.ఇక ఆ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి ఆపిల్ కంపెనీ తాజా అప్‌డేట్‌ తెచ్చి పెట్టింది. “Move beyond passwords” కార్య‌క్ర‌మంలో పాస్‌వర్డ్‌ లేకుండానే లాగ్ ఇన్ చేసుకునే స‌దుపాయాన్ని వినియోగ‌దారుల‌కు పరిచయం చేయడం జరిగింది.ఇక 'పాస్‌కీ' అని పిలిచే ఈ సైన్అప్ లో ఇక పై పాస్ వ‌ర్డ్ అవ‌స‌రం లేద‌ని, కేవ‌లం ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీని ఉప‌యోగిస్తే స‌రిపోతుంద‌ని తెలిపడం జరిగింది.అలాగే దీనివ‌ల్ల వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త ఆన్ లైన్ అకౌంట్స్ కు ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని, ఆన్ లైన్ మోసాల్ని త‌గ్గించేందుకు ఉప‌యోగ‌పడుతుంద‌ని ఆపిల్ సంస్థ వెల్ల‌డించడం జరిగింది.



ఇక పాస్ కీ ఎలా పని చేస్తుందంటే..స‌ఫారీ బ్రౌజ‌ర్ లో మీరు చూసిన వెబ్ సైట్ లో సైన్ అప్ కావాల్సి వ‌స్తే ఐడీ ని ఎంట‌ర్ చేసి పాస్ వ‌ర్డ్ ఎంట‌ర్ చేసే బ‌దులు ఫేస్ ఐడీని, ట‌చ్ ఐడీని వాడాలి. మీకు పర్మిషన్ ఇవ్వ‌డానికి, సైన్ ఇన్ చేయడానికి మీ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆపిల్ Move beyond passwords కార్య‌క్ర‌మంలో వివ‌రించడం జరిగింది. ఇక పాస్ కీ అనేది రాబోయే ఐఫోన్, ఐప్యాడ్ ఇంకా మాక్స్‌కు టెక్నాలజీల‌కు ఒక ప్రివ్యూగా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక ఈ కొత్త పాస్ కీ టెక్ ఐక్లౌడ్ కీచైన్‌లో ఒక భాగమట. ఇది FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్) అలయన్స్ వెబ్‌ఆథ్న్ ప్రోటోకాల్‌పై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఈ పాస్‌కీ ఫీచ‌ర్ సేఫ్ అని , సైబ‌ర్ దాడులు జ‌ర‌గ‌కుండా వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త డేటా సుర‌క్షితంగా ఉంటుంద‌ని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. కాక‌పోతే ఈ ఫీచ‌ర్ ఒక్క ఆపిల్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంద‌ని, ఆండ్రాయిడ్ వినియోగ దారులు ఐడీ, పాస్ వ‌ర్డ్ ల‌ను త‌ప్ప‌ని స‌రిగా ఎంట‌ర్ చేయాలిసిన అవసరం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: