ఏ వ్యక్తి అయినా సరే ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఫోటో కి వచ్చేసరికి చాలా అందవిహీనంగా మారుతుంటారు. అక్కడున్నది వీరేనా అనే అనుమానం కలిగేలా ఆధార్ కార్డు లో ఫోటోలు అప్ లోడ్ అవుతూ ఉంటాయి. చూడటానికి చాలా భయంకరంగా కూడా ఆధార్ కార్డులో ఫోటో లు రావడం గమనార్హం. అందుకే ఈ ఫోటోలను రిసీవ్ చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఇక నచ్చిన ఫోటోలు ఆధార్ కార్డు లో అప్లోడ్ చేసుకోవాలని అందుకు తగ్గట్టుగా ఏదైనా ఆప్షన్ వస్తే బాగుంటుందని అనుకున్న వారు కూడా లేకపోలేదు. అందుకే ఈ మధ్యకాలంలో అలాంటి ఆప్షన్ ని.. ఫోటోలు మార్చుకోవాలని అనుకునేవారికి అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.

ఆధార్ కార్డు లో స్మార్ట్ ఫోటో గ్రాఫ్ కావాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. సాధారణంగా భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేయబడిన గుర్తింపు కార్డు లో హోల్డర్ పేరు, చిరునామా మొదలైనవాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. 12 అంకెల గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు తో బ్యాంకు ఖాతాలను తెరగడమే కాకుండా ప్రతి ముఖ్యమైన పనికి తప్పకుండా ఉపయోగిస్తారు. మీరు మీ ఆధార్ కార్డ్లో మార్పులు చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా యుఐడిఎఐ సంప్రదించాల్సి ఉంటుంది.

ఇక అందులో భాగంగానే ఫోటో మార్చుకోవడానికి కూడా కొన్ని దశలు ప్రస్తుతం కింద ఇవ్వడం జరిగింది వాటిని పూర్తిగా చదివి తెలుసుకోండి.

1. ముందుగా యుఐడిఎఐ అనే వెబ్సైట్ ను సందర్శించాలి. https://uidai.gov.in/ సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
2. మీ ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఫారమ్ ను డౌన్లోడ్ చేయండి.
3. అవసరమైన అన్ని వివరాలను ఈ ఫారం లో ఫీడ్ చేయాలి.
4. ఆ తర్వాత ఆధార్ నమోదు కేంద్రాలు వెళ్లి ఫారం సమర్పించండి.
5. ఇక మీరు మీరు కొత్త చిత్రాన్ని ఇక్కడ అందించవచ్చు. 6.అలాగే జిఎస్టి తో కలిపి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రసీదు స్లిప్పు తో పాటు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ని కూడా మీరు అందుకుంటారు.
7.ఇప్పుడు ఈ నెంబర్ తో ఆధార్ కార్డు అప్డేట్ ట్రాక్ చేయవచ్చు. మీరు కోరుకున్న ఫొటోతో కూడిన ఆధార్ కార్డు రావాలి అంటే సుమారుగా 90 రోజుల సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: