అంతరిక్ష పరిశోధనలో భారత దేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతోంది. ఈ మధ్య చంద్రయాన్ మిషన్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత్, తాజాగా ఆదిత్య ఎల్ 1 తో మరో విజయాన్ని అందుకుంది. సంపన్న దేశాలన్నీ వేల కోట్లు ఖర్చు చేసే మిషన్ కి ఇండియా మాత్రం చాలా తక్కువ ఖార్చు పెట్టి విజయాన్ని సాధిస్తుంది. ఇండియా విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ మిషన్ ఖార్చు సుమారు 600 కోట్లు. ఇందులో రోవర్, ల్యాండర్, మరియు ప్రొపల్షన్ సిస్టం ఖరీదు 215 కోట్లు. ఐతే ఇంత మొత్తం ఖార్చు చేసి నింగిలోకి పంపిన ల్యాండర్, రోవర్లు తిరిగి భూమి తెచ్చే ప్రయత్నం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చెయ్యడం లేదు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ సందేహాలు తీరాలంటే ఇది చూడండి.

చంద్రయాన్ 3 ద్వారా మనం ప్రయోగించినవి విక్రమ్ ల్యాండర్, మరియు, ప్రగ్యాను రోవర్. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి పై ఉపగ్రహాన్ని నిలిపేందుకు ఉపయోగపడుతుంది. ఉపగ్రహం చంద్రుడిపైకి వెళ్ళాక, రోవర్ మనకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఐతే ఈ రెండు పరికరాలు మళ్ళీ తిరిగి భూమిని చేరవు. సాంకేతిక సమస్యలు, సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే, ఒకసారి అంతరిక్షంలోకి పంపిన రోవర్ని మళ్ళీ తిరిగి భూమి పైకి తీసుకురావడం చాలా ఖార్చు తో కూడుకున్న పని. రోవర్ని మళ్ళీ తిరిగి భూమి పైకి తీసుకురావడానికి అయ్యే ఖర్చుతో మరో ప్రయోగం చెయ్యవచు. అందుకే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న దేశాలన్నీ తమ ప్రయోగాలలో వన్ వే మిషన్ పద్ధతి లోనే తమ రోవర్, ల్యాండర్ లను పంపిస్తాయి. వీటిని ఒకసారి పైకి పంపించక, తిరిగి రప్పించడం ఉండదు. అక్కడికి వెళ్లి మనకు కావలసిన సమాచారాన్ని సేకరించి, రేడియో వేవ్స్ రూపంలో మనకు అందించి, ఆ తరువాత అక్కడే ఉండిపోతాయి. మరి భవిష్యత్తులో ఈ పరికరాలను తక్కువ ఖర్చుతో భూమి పైకి తిరిగి తెచ్చే టెక్నాలజీ వస్తుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: