పండుగ సీజన్ మొదలైంది అంటే చాలు పలు రకాల మొబైల్స్ పైన కొత్త మొబైల్స్ సైతం విడుదలగుతూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ దిగ్గర సంస్థలలో ఒకటైన వన్ ప్లస్ మొబైల్ సంస్థ.. OnePlus -11 R సోలార్ రెడ్ వేరియంట్ మొబైల్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.ఈ మొబైల్ 18Gb రామ్ పాటు స్టైలిష్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది. మరొకవైపు వెనక సైడ్న లెదర్ పానెల్ ని కూడా కలిగి ఉంటుందట. ఈ మొబైల్ ఈనెల 7వ తేదీన అందుబాటులోకి రాబోతోంది.


వన్ ప్లస్ 11R మొబైల్ హార్డ్వేర్ వేరియంట్ మార్కులతో రాబో తోంది.18 GB ram +512 GB స్టోరేజ్ తో ఈ మొబైల్ రిలీజ్ కాబోతోంది. ఈ మొబైల్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలలో లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ వన్ ప్రాసెస్ ను కలిగి ఉంటుందట.. కెమెరా విషయానికి వస్తే 50 mp ప్రైమరీ కెమెరాలు కలిగి ఉంటుంది. ఫ్రంట్ వైపు 16 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా కలదు. బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు కలవు...6.7 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలదు.. ఆండ్రాయిడ్ -13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది.


వన్ ప్లస్ 11R బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah సామర్థ్యం తో పాటు 100 w సూపర్ వాక్ ఛార్జింగ్ సపోర్ట్ తో పని చేస్తుందట. కేవలం ఈ మొబైల్ 25 నిమిషాల 0 నుంచి 100% వరకు చార్జింగ్ చేయవచ్చని వన్ ప్లస్ సంస్థ తెలియజేస్తోంది. ఈ మొబైల్ ధర రూ.37,999 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వాటిలలో బ్యాంకు కార్డుల పైన పలు రకాల డిస్కౌంట్ సైతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: