ఆదిశంకరాచార్యుల గురించితెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈయనను సృష్టికర్త, ధర్మాన్ని స్థాపించిన వ్యక్తి అని కూడా పిలుస్తారు. అదేంటి సృష్టికర్త అంటే బ్రహ్మ కదా ! మరి ఆదిశంకరాచార్యుల వారిని ఎలా పిలుస్తారు ? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలగవచ్చు. ధర్మం నీచ స్థితికి చేరుకున్నప్పుడు, శిష్టరక్షణకై, దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో  శ్రీ కృష్ణపరమాత్ముడు చెప్పాడు. "సంభవామి యుగే యుగే"  ధర్మగ్లాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం, ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం. అలానే వేదాలలో, శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి, జనులను పక్కదోవ పట్టించి, అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం జరిగినప్పుడు, అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది అని  శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు


కలియుగానికి వచ్చేసరికి ప్రజల్లో వున్న రాక్షస బుద్దిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలని సాక్షాత్తు పరమేశ్వరుడే  ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా, శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తుడైన శంకరాచార్యుల వారు జన్మించారు. అంటే పరమశివుడే మళ్లీ శంకరాచార్యుల వారి రూపంలో ధర్మస్థాపన చేయడానికి మళ్ళీ పుట్టారు.. అందుకే శంకరాచార్యుల వారిని సృష్టికర్త అని అంటారు..


ఈ శంకరాచార్యులవారు జ్ఞానంలో దేవతలకు మించి ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన 5 వ సంవత్సరం లోనే ఉపనయనం చేసుకుని, అతి తక్కువ సమయంలోనే అంటే తన అయిదవ సంవత్సరంలో ఏ మానవమాత్రులకు కూడా సాధ్యం కాని "అష్టవర్షే  చతుర్వేది ద్వాదశీ సర్వశాస్త్రవిత్ " , తన ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు, పన్నెండేళ్ళ వయసులో సర్వ శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఇక ఆది శంకరాచార్యులవారు వేదాలను అధ్యయనం చేస్తున్న సమయంలో భిక్షాటన కోసం ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి, బిక్షం అడగగా ఆమె ఒక ఉసిరికాయను దానంగా ఇచ్చింది. ఇక  ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు "కనకధారాస్తోత్రం" ఆశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షం గా కనిపించింది..

మహా మహా పండితులు కూడా మళ్లీ మళ్లీ చదివితే తప్ప అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు. కనీసం శబ్ద జ్ఞానం కూడా లేనటువంటి, సామాన్య వ్యక్తికి కూడా వేదాంత విషయాలను "భజగోవిందం " వంటి రచనల ద్వారా ప్రబోధించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలని, సమైక్యవాదిని సాధించాలని, ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదని నిరూపించినవి  ఆయన రచనలు.. ఇక కాలినడకన దేశమంతా పర్యటించి మొత్తం -72 మతాలను సమానంగా ఖండిస్తూ, వేద ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని కూడా ప్రతిష్టించారు. జ్ఞాన మార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ప్రసరింపచేయాలనే ఉద్దేశంతోనే తూర్పున పూరీ లో గోవర్ధన పీఠం , దక్షిణాన శృంగేరి లో  శ్రీ శారదా పీఠం , పశ్చిమాన ద్వారక లో శారదా పీఠం, ఉత్తరాన బదరి లో జ్యోతిష్పీఠాలను స్థాపించారు. ఈ పీఠాల పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనాలకు ధర్మప్రబోధం జరిగి ,అందరూ వేదోక్త కర్మలు ఆచరించి, జ్ఞాన మార్గాన్ని పొంది, అందరిని సత్య మార్గంలో నడపాలని, లోకోపకారం కోసం శంకరాచార్యులవారు పాటుపడ్డారు..


మరింత సమాచారం తెలుసుకోండి: