పాకిస్తాన్ కి చెందిన
భార్య భర్తలు ఒక విమానంలో బాగా రెచ్చిపోయి ముద్దులు పెట్టుకుంటూ శృంగార కలాపాలలో మునిగితేలారు. విమానం ఎక్కిన సమయం నుంచి ఈ దంపతులు గాఢాలింగనము చేసుకొని సుదీర్ఘమైన చుంబనాలతో అన్ని హద్దులు మీరారు. తమ తోటి ప్యాసింజర్లు ఇబ్బందిగా ఫీల్ అవుతారని కూడా పట్టించుకోకుండా ఈ దంపతులు ప్రవర్తించారు. అయితే వారి రొమాన్స్ చూడలేక తోటి ప్రయాణికులు కళ్ళు మూసుకున్నారు. మరికొందరు విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఎయిర్ హోస్టెస్ వచ్చి.. విమానాల్లో ఇలా బహిరంగంగా ప్రవర్తించ కూడదు అని సున్నితంగా చెప్పి చూసింది. కానీ ఆ దంపతులు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మేమేం చేయాలో.. మేమేం చేయకూడదో కూడా మీరే చెప్తారా? మాకు నచ్చినట్టు చేసుకుంటాము.. మీరేదైనా చేసుకోండి అని ఆ దంపతులు ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎయిర్ హోస్టెస్ ఒక దుప్పటి ఇచ్చి వెళ్ళిపోయింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ సంఘటన గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే.. మే 20వ తేదీన పీఏ-200 ఫ్లైట్ కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. అయితే ఇదే విమానంలో పాకిస్తానీ దంపతులు ఎక్కారు. కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ఐతే ఈ రెండు గంటల ప్రయాణం లో.. పాకిస్తానీ భార్యాభర్తలు విమానంలో బహిరంగంగానే ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. వీరి విపరీత చేష్టలతో బాగా ఇబ్బంది పడిపోయిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి కంప్లైంట్ చేశారు. కానీ ఆ దంపతులు మాత్రం ముద్దులు పెట్టుకోవడం మాత్రం ఆపలేదు. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుంది కాబట్టి వారిని అర్ధాంతరంగా దింపే ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో తోటి ప్రయాణీకులకు నచ్చచెప్పేందుకు ఓ ఎయిర్ హోస్టెస్ దంపతులకు దుప్పటి ఇచ్చి వెళ్ళిపోయింది.
ఐతే ఇదే విమానంలో బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే
న్యాయవాది కూడా ప్రయాణిస్తున్నారు. ఆయన దంపతులు అసభ్యకర చేష్టలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీనితో సీఏఏ.. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని విమాన సిబ్బందికి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వార్త బయటకి రావడంతో నెటిజన్లు రకాలుగా స్పందిస్తున్నారు. ఛిఛీ, విమానంలోనే పాడు పని చేస్తుంటే.. వారిని ఆపాల్సిందిపోయి.. ఎయిర్ హోస్టెస్ దుప్పటి ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.