కొంద‌రి ట్యాలెంట్ చూస్తే ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే. వారి ట్యాలెంట్‌తో చాలా ర‌కాల విన్యాసాలు చేస్తుంటారు. కొంద‌రు ర‌క‌ర‌కాల సౌండ్లు చేస్తుంటారు. ఇంకొంద‌రు యోగాల్లో విన్యాసాలు చేస్తుంటారు. డ్యాన్సులు, పాట‌ల‌తో మెప్పించే వారు ఎంద‌రో ఉన్నారు. అయితే ఓ వ్య‌క్తి మాత్రం త‌న త‌ల‌తో చేస్తున్న విన్యాసాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సాధార‌ణంగా మ‌నం మ‌న త‌ల‌ను కేవ‌లం కొంత వ‌ర‌కే తిప్ప‌గ‌లుగుతాం.

మన తలను కేవ‌లం ఎడ‌మ‌వైపు గానీ, లేదా కుడివైపు గానీ కొంత కోణం వరకు మాత్రమే తిప్పేస్తాం. మన వెనుక ఏం జరుగుతుందో అనేది మ‌నం స‌రిగ్గా చూడ‌లేక‌పోతాం. అయితే ఇక్క‌డున్న వ్యక్తి మాత్రం ఏకంగా తన తలను 180 డిగ్రీల వరకు వెన‌క్కు తిప్పి చూస్తున్నాడు. ఈ విధంగా తలను పూర్తిగా వెనక్కి తిప్పడం ఒక్క గుడ్లగూబలకు మాత్రమే వీల‌వుతుంది.

అదేంటో గానీ ఈ వ్యక్తి మాత్రం తన తలను ఈజీగా 180 డిగ్రీలు తిప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మొదటగా ఈ వ్యక్తి తన త‌ల‌ను మొత్తం ముందుగా పైకెత్తి, ఆ వెంట‌నే త‌న గడ్డాన్ని మొత్తం వెనక్కి తిప్పి వెన‌కున్న వాటిని చూస్తున్నాడు. ఈ విధంగా త‌న త‌ల‌ను వెనక్కి తిప్పినా ఎలాంటి బాధ లేద‌ని చెబుతున్నాడు. ఎలాగైతే వెన‌క్కు తిప్పాడో అదే విధంగా మళ్లీ యధాస్థితికి త‌ల‌ను తిప్పుతున్నాడు ఈ వ్య‌క్తి.

అయితే ఇలాంటి ప‌ని కేవలం అనుభవం ఉన్న స్టంట్ మ్యాన్ కే సాధ్యం అని చెబుతున్నారు నిపుణులు. ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఇలాంటివి మామూలు వ్య‌క్తులు ఎవ‌రూ ఇంట్లో ట్రై చేయకండి. ఎందుకంటే ఇలాంటి విన్యాసాలు చాలాప్రమాదక‌రం అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ టిక్‌టాక్ యూజర్ పోస్ట్ చేసిన ప్ర‌స్తుత వీడియో సోషల్ మీడియాలో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: