
కానీ ఇక్కడ ఓ దొంగ తన పెద్ద మనసు తో దొంగిలించిన వస్తువును తిరిగి ఇచ్చి పాట్లు పడ్డాడు. మీరు విన్నది అక్షరాల నిజం.. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆ కొట్టేసిన వస్తువు బంగారం కాదని తెలుసుకొని వెనక్కి తిరిగి ఇవ్వడానికి వెళ్ళి అడ్డంగా బుక్కయిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ ఫన్నీ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. వివరాల్లొకి వెళితే.. అనంతపురం జిల్లా నగరం నడి బొడ్డున జరిగింది. నీరుకుంట వీధి లో ఓ మహిళ ఇంటి బయటకు వచ్చి చెత్త ఊడుస్తుంది.
అప్పుడు ఆమె మెడ లో తాళి బొట్టు ఒక గిల్ట్ చైన్ కు వుంది. అది నిజంగానే బంగారం అనుకున్న ఓ దొంగ కాపు కాసాడు. ఆమె తో మాట్లాడితే ఆమె దృష్టి మారుతుంది అని అనుకున్నాడు. అలానే ఆమె దగ్గరకు వెళ్ళి అడ్రస్ అడిగాడు. ఆమె చెబుతున్నా సమయం మెడలో తాళి బొట్టు లాక్కుని బైక్ పై 90 స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ఆ క్రమం లో అతని పర్స్ అక్కడ పడిపోయింది. కొంత దూరం వెళ్ళిన అతను అది గిల్ట్ అని తెలుసుకొని ఆమెకు ఇచ్చి పర్స్ తెచ్చుకొవాలని వెళ్లాడు. అంతే అందరూ తనని పట్టుకోని, చిథకబాదారు. పోలీసుల కు అప్పగించారు. అది అక్కడ జరిగింది.