పానీ పూరి.. ఈ పేరు వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి నోరూరిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నో రకాల వంటకాలు అందరికీ అందుబాటులోకి ఉన్న.. ఇక ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారంగా మారిపోయింది పానీపూరి. ఈ క్రమంలోనే రోజులో ఒక్కసారైనా పానీ పూరి తినకుండా ఉండలేకపోతున్నారు చాలామంది జనాలు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే పానీపూరీకి బానిసలుగా మారిపోయారు అనడంలోనూ సందేహం లేదు.


 ఇక పానీ పూరి అమ్ముతున్న చుట్టుపక్కల ఎంత మురికిగా ఉన్నప్పటికీ పట్టించుకోని జనాలు ఇక పానీపూరి బండి చుట్టూ చేరి భయ్యా తొడ ప్యాస్ డాలో అంటూ లొట్టలు వేసుకుంటూ పానీపూరీలు ఆరగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో పానీపూరీలు అమ్మడం చూసాము. కానీ వేగంగా దూసుకుపోతున్న రైలులో పానీపూరీలు అమ్మడం ఎప్పుడైనా చూసారా. సాధారణంగా అయితే లోకల్ ట్రైన్లలో చిరుతిండ్లను అమ్ముతూ ఉంటారు. ఉడికించిన వేరుశనగలు, సమోసాలు, బిస్కెట్లు అమ్మడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లోకల్ ట్రైన్ లో స్నాక్స్ అంటే అందరికీ గుర్తు వచ్చేవి సమోసాలు మాత్రమే. కానీ ఇప్పుడు లోకల్ ట్రైన్ లో పానీ పూరి అమ్మడం మొదలుపెట్టారేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి కదులుతున్న రైలులో పానీపూరీలు అమ్ముతూ ఉండడాన్ని అదే రైలులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక పానీపూరీ లవర్స్ అందరూ కూడా ఆ వ్యక్తి చుట్టూ చేరి లొట్టలు వేసుకుంటూ పానీ పూరి తింటున్నారు. అయితే ఇది ఏ ట్రైన్ లో జరిగింది అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.  ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక పానీ పూరి కోసం ఆగాల్సిన పనిలేదు ట్రైన్ లో జర్నీ చేస్తున్న హాయిగా తినేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: