
బహుభర్తృత్వం యొక్క అనాగరిక సంప్రదాయం కింద ఈ వివాహం జరిగింది. మహిళలు ఎవరు వితంతువులుగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో హట్టీ తేగలోని పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ట్రాన్స్ గిరి మరియు సిర్మౌర్ ప్రాంతంలో ఈ రకమైన ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ట్రాన్స్ గిరిలోని బధానా గ్రామంలో గత ఆరేళ్లలో అలాంటి ఐదు వివాహాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి `జోడిదారా` అని పేరు కూడా పెట్టాయి.
ఇక షిల్లాయ్ కు చెందిన ప్రదీప్ ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ అన్నదమ్ములు పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం తమ ఆచారాలను మర్చిపోలేదు. ఇద్దరు కలిసి సునీతా చౌహాన్ ను పెళ్లి చేసుకున్నారు. ట్రాన్స్-గిరి ప్రాంతంలో జూలై 12న ప్రారంభమై మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహం తన పూర్తి సమ్మతితోనే జరగిందని, ఎటువంటి ఒత్తిడి లేదని వధువు సునీతా చౌహాన్ పేర్కొన్నారు. దీంతో ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఇదెక్కడి వింత ఆచారం రా బాబు అంటూ నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.