పైరసీ వెబ్‌సైట్‌ ‘ఈభొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఒక దశలో పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ విసిరిన రవిని, పక్కా సమాచారంతో ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు తర్వాత, ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతుంటే, రవి తండ్రి అప్పారావు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత చర్చకు దారి తీస్తున్నాయి. తన కొడుకు వ్యవహారాలపై అప్పారావు స్పందిస్తూ— “నా అబ్బాయి కోట్ల రూపాయలు సంపాదించాడు… కానీ నాకు మాత్రం తినడానికి సరిగ్గా భోజనం కూడా దొరకలేదే” అని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, రవికి వ్యక్తిగతంగా ఎలాంటి చెడు అలవాట్లు లేవని, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలు కూడా లేవని స్పష్టంగా చెప్పారు.


అయితే ఇదే సందర్భంగా ఆయన చేసిన మరో వ్యాఖ్య అందరిని షాక్‌కు గురిచేస్తోంది. తన కొడుకు రవికి క్రిమినల్ నైపుణ్యం, చతురత, ఆలోచనా విధానం అన్నీ తల్లి వైపు నుంచి వచ్చినవేనని, ఆమె ‘లా క్రిమినల్ మైండ్ ఉందని అన్నారు. “మా వంశంలో ఇలాంటి ఖిలాడీలు ఎవరూ లేరు. వాళ్ల అమ్మ బ్రెయిన్ మంచిది కాదు. ఆమె ఎప్పుడూ వ్యతిరేక పనులే చేసేది” అని అప్పారావు ఘాటుగా ఆరోపించారు. అంతేకాదు— “నేను డ్యూటీకి వెళ్లకుండా అడ్డుకోవడానికి తలుపులు వేసేది. తరచూ అల్లరి చేసేది. ఆ కారణాల వల్లే ఆమెతో దూరంగా ఉండాల్సి వచ్చింది” అని తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు.



తాము ఏ సమయంలోనూ ఎవరితోనూ గొడవపడకుండా తమ పని తాము చేసుకునే కుటుంబమని, కానీ ఇప్పుడు కొడుకు చేసిన పనుల వల్ల రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని బాధతో చెప్పారు. ఇమ్మడి రవి చేస్తున్న అక్రమ కార్యకలాపాల గురించి తాను ఎప్పుడూ అనుమానం పెట్టుకోలేదని, కానీ జరిగిన పరిణామాలతో ఇప్పుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. న అపరువు మొత్తం పోయింది అంటూ బాధపడ్డారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: