ఆడవాళ్లు అందానికి మారు పేరు.అందంగా కనపడడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయిన గాని మార్పు అనేది ఉండదు.కొంతమంది ఆడవాళ్ళ ముఖం నల్లగా చూడడానికి కాంతి హీనంగా ఉంటుంది. అలాంటి కొంతమంది ఆడవాళ్లు వాళ్ళ నల్లటి ముఖాన్ని చూసుకుని ప్రతిరోజు భాదపడుతూ ఉంటారు.తెల్లగా రావడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ఉత్పత్తులు ఎన్నో వాడతారు. అయిన ఫలితం ఉండదు. అందుకనే మీ నల్లటి ముఖాన్ని మన ఇంట్లో దొరికే సహజమైన పద్దతులలో తెల్లగా మార్చుకోడానికి కొన్ని చిట్కాలు చూద్దామా.. !!



మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా,నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.కొంచెం సేపు అయ్యాక ముఖం కడుక్కుంటే సరి. అలాగే నిమ్మ,తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి.బంగాళాదుంపల రసం కూడా ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ బంగాళాదుంప రసాన్ని తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి.



రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.అలాగే వారానికి రెండు సార్లు తప్పకుండా శనగపిండి,పసుపుతో నలుగు పెట్టుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మట్టి తొలగిపోతుంది. చర్మం మృదువుగా మారుతుంది. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి.ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి ఇలా చేయడం వల్ల చర్మం చామనచాయ రంగులోకి వస్తుంది..కారణం ఏదయినా కానీ మీ చర్మం నలుపు రంగులో మారితే పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ చర్మం తెల్లగా మారుతుంది.. !!

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: