సిటీకి ఎవరైనా కొత్తగా వచ్చి ఆటో  ఎక్కారు అనుకోండి.  కొత్త గా వచ్చిన వాళ్ళు అని  గ్రహించిన ఆటో డ్రైవర్లు  వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కేంద్రం విధించిన భారీ జరిమానా లతో ఇది కాస్త ఇంకొంచెం ఎక్కువ అయ్యింది. ఆటో పై పడ్డ చలాన్లు అన్ని ఒక్క  అమాయకుడు దొరికితే అతని దగ్గర నుంచి లాకేసుకుందామని  అనుకుంటారు . అయితే సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ల దగ్గర ఆటో డ్రైవర్లు భారీగా డబ్బులు వసూలు చేయడం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. అక్కడక్కడ నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఈ కోవకు చెందిందే.

 

 

బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ  పూణే ఫస్ట్ టైం వచ్చి కత్రా ఏరియాలో బస్సు దిగి అక్కడి నుండి గమ్యస్థానానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. అప్పటికే 5 గంటల ప్రయాణం చేసి అలసిపోయిన అతను  క్యాబో,  ఆటో నో  ఏదైతే ఏంటి గమ్యానికి చేరడం ముఖ్యం అనుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న ఆటోను ఎరవాడ వెళ్తావా అని అడిగాడు. ఆటోడ్రైవర్ వెళ్తాను అని చెప్పడంతో ఆటో లో ఎక్కాడు aa టెక్కీ . అయితే వెనక సీట్ లో ఓ వ్యక్తి ఫుల్ గా మందు కొట్టి ఉన్నాడు. అయితే ఇది వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ఆటో డ్రైవర్ ని అడగ్గా... అతనే  ఆటోడ్రైవర్ మందు తాగి డ్రైవింగ్ చేస్తే ఫైన్ వేస్తారని  వెనుక కూర్చున్నాడు. అయినా మీకు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను కదా అని సమాధానమిచ్చాడు ఆటో నడుపుతున్న వ్యక్తి . అయితే ఒక కిలోమీటరు దూరం వెళ్లగానే ఎరవాడ వచ్చేసింది. వచ్చేసింది దిగండి అంటూ ఆ టెక్కీకి   ఆటో నడుపుతున్న వ్యక్తి చెప్పగా ... ఎంత అయ్యింది అని అడిగాడు ఆ  సాఫ్ట్ వెర్ ఇంజనీర్.  4,300  అయింది అనటంతో షాక్ గురయ్యాడు ఆ టెక్కీ. అంత ఎలా అవుతుంది అని ప్రశ్నించగా... ఆటో నడుపుతున్న వ్యక్తి, ఆటో డ్రైవర్స్ అతనితో గొడవకి దిగారు. దీంతో చేసేదేం లేక వారు అడిగినంత ఇచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేసాడు ఆ టెక్కీ. సీసీ కెమెరాలు ఆధారంగా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: