బైక్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చేసింది. దీనికి కారణం బ్రిటీష్ మోటార్ సైకిళ్ల సంస్థ ట్రైంఫ్ తన స్ట్రీట్ ట్రిపుల్ RS బైక్ ను ఇప్పటికే లాంచ్ చేయాల్సి ఉండగా.. కరోనా దెబ్బ ప్రభావంతో పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2020 మోడల్ ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS మోటార్ సైకిల్ ధరను మాత్రం పెంచలేదు కంపెనీ. అయితే ఈ స్పోర్ట్స్ బైక్ ధర వచ్చేసి ఎక్స్ షోరూంలో రూ.11.13 లక్షలు గా ఉంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో అందుబాటులోకి ఈ బైక్ సొంతం  చెప్పవచ్చు. 

 


ఇక ఈ బైక్ ప్రత్యేకతల గురించి చెబితే ... BS - 6 స్ట్రీట్ ట్రిపుల్ RS  బైక్ లో సరికొత్త LED హెడ్ లైట్లు, ఇండిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ లైట్లు లాంటి వాటిని కొత్తగా ఇందులో పెట్టబోతున్నారు. ఇంకా ఇందులో బాడీ ప్యానెల్స్, ఫ్లై స్క్రీన్, సైడ్ ప్యానెల్స్, సీటు, బైక్ వెనుక భాగాన్నీ చాలా బాగా అప్ డేట్ చేశారు. ఇక ఈ మార్పులతో ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS బైక్ స్పోర్టీ లుక్ తో కళ్ళను తిప్పుకోకుండా చేస్తోంది. 

 


ఇంకా అంతేకాకుండా టీఎఫ్ టీ ఇన్ స్ట్రూమెంట్ డిస్ ప్లే పై సరికొత్త గ్రాఫిక్స్ నూ పొందుపరిచిందీ సదరు కంపెనీ. ఇందులో వీటితోపాటు బ్లూటూత్, గో ప్రో కంట్రోల్స్ లాంటి ప్రత్యేకతలు ఈ బైక్ ప్రత్యేకత. ఈ 2020 మోడల్ ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS మోటార్ సైకిల్లో టీఎఫ్టీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది ఈ బైక్. ముక్యంగా మెయిన్ ఫ్రేమ్ టైటానియం సిల్వర్ రంగులోకి డిజైన్ చేసారు.
 


ఇక ఇంజిన్ విషయానికి వస్తే ... పునరుద్ధరించిన ఇంజిన్ తో అందుబాటులోకి వచ్చిన ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS మోటార్ సైకిల్ లేటెస్ట్ నియంత్రణలకు తగట్టు మార్పులు చేసింది. BS - 6 ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS మోటార్ సైకిల్ 765 cc, 3 సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉంది. ఇక ఇది 121 BHP బ్రేక్ హార్స్ పవర్, 79 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: