ఇక ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ 'టొయోట' ఇండియన్ మార్కెట్లో ఒక కొత్త హైబ్రిడ్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే కంపెనీ ఇటీవల అన్ని వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడించింది. అంతకంటే ముందే ఈ కొత్త హైబ్రిడ్ కారు కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు డెలివరీలు కూడా ప్రారంభించింది. టొయోట కంపెనీ విడుదల చేసిన కొత్త 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' డెలివరీలు ఈ నవరాత్రుల సమయంలో విజయదశమి కంటే ముందే ప్రారభమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో టొయోట హైరైడర్ ధరలు రూ. 10.48 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి కొనుగోలుదారులు ముందస్తుగా రూ. 25,000 చేసుకోవచ్చు.కొత్త టొయోట 7 మోనోటోన్ కలర్స్, 4 డ్యూయెల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇది మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది డిజైన్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందువల్ల ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.


డోర్స్ మీద హైబ్రిడ్ బ్యాడ్జ్‌ వంటి వాటిని చూడవచ్చు. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు సైజ్ పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇది 4365 మిమీ పొడవు, 1795 మిమీ వెడల్పు, 1645 మిమీ ఎత్తు మరియు 2600 మిమీ వీల్ బేస్ ఉంటుంది. దీని వల్ల క్యాబిన్ విశాలంగా ఉంటుంది, సుదూర ప్రయాణాలకు కూడా ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది.ఇందులో 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో ఇంకా యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసీ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ ఇంకా అలాగే ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: