ఈనెల చివర్లో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈ పాదయాత్రకు వైసీపీ సర్కారు అనుమతి ఇస్తుందా.. ఇబ్బందులు పెడుతుందా అన్నది ఉత్కంఠభరితంగా ఉంది. బహిరంగ సభలు, రోడ్ షోలకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి పోలీసులు అనుమతినిస్తారని ఆ మధ్య అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పుకొచ్చారు. తాము బహిరంగ సభలు, రోడ్ షో లను ఆపేందుకు జీఓ 1 తీసుకువచ్చామనే ఆరోపణల్లో నిజం లేదని అప్పట్లో అన్నారు .


అంతే కాదు.. మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని సంబంధిత జిల్లాల ఎస్పీలు పరిశీలించి అనుమతి ఇచ్చే అంశంపై నిర్ణయిస్తారని ఏడీజీపి వివరించారు. రోడ్ షో లు, పాదయాత్రలపై నిషేధంవిధించలేదని తెలిపారు. అయితే.. జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయితీ రోడ్లపై సభలు నిర్వహించటానికి పోలీసు యాక్ట్ ప్రకారం అనుమతి లేదని చెప్పారు. మరి నారా లోకేశ్ పాదయాత్ర కోసం టీడీపీ దరఖాస్తు చేసిందా.. అనుమతి ఇచ్చారా.. లేక తీసుకుంటారా.. అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: