పాలు, గుడ్డు హెయిర్ ప్యాక్ :
ఒక కప్పు పాలు,రెండు గుడ్లు తీసుకొని,ఒక నిమిషం పాటు రెండు కలిపి, బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఒకవేళ గుడ్డు కలపడం వల్ల వాసన వస్తుంది అంటే, గుడ్డులోని పచ్చసొనను తీసేసి, తెల్లసొనను మాత్రమే ఉపయోగించండి. ఇక ఆ తరువాత గాఢత లేని షాంపూలతో స్నానం చేయాలి.
కొబ్బరి పాలు, నిమ్మరసం :
కొబ్బరిపాలు జుట్టుని సహజంగా తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుని,అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్,రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న స్టార్చ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు వేడి చేసి, తర్వాత చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు ఆరనిచ్చి గాఢత తక్కువగా కలిగిన షాంపూతో శుభ్రం చేయాలి.
అరటి, తేనే,పెరుగు :
ఇక ఇవి కూడా ఆరోగ్యకరమైన జుట్టు తో పాటు జుట్టు స్ట్రైట్ గా సిల్కీ గా ఉండేలా చేస్తాయి. ఇందుకోసం అరటి పండును మెత్తగా చేసి, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనే, అర కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని మీ జుట్టు మీద అప్లై చేసి, టవల్ తో చుట్టి గంటసేపు వదిలేయండి. ఆ తర్వాత తలస్నానం చేయాలి .ఇలా చేయడం వల్ల జుట్టు సహజంగా మెత్తగా తయారవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి