ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మందిని బాగా వేదిస్తున్న సమస్య చుండ్రు సమస్య. చుండ్రు సమస్యతో చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ పద్ధతులు పాటించడం వలన చుండ్రు సమస్య శాశ్వతంగా తగ్గడం ఖాయమట...నిమ్మకాయ తొక్కలని నీటిలో ఇరవై నిమిషాల పాటూ మరిగించండి. పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ మిశ్రమంతో వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేయండి.ఒక నిమ్మ కాయ రసం తీయండి. ఈ రసాన్ని మీ స్కాల్ప్ కి పట్టించి పదిహేను ఇరవై నిమిషాలు ఉంచండి. మామూలుగా హెయిర్ వాష్ చేసేసుకోండి. రీటా పౌడర్ తో పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ కి పట్టించండి. రెండు గంటల తరువాత చల్లని నీటితో కడిగేసి షాంపూ చెసేసుకోండి. రోజ్‌మేరీ ఆయిల్ ని వెనిగర్ తో కలిపి మీ స్కాల్ప్ కి పట్టించండి. పదిహేను నిమిషాల తరువాత మామూలుగా హెయిర్ వాష్ చేసేసుకోండి.రెండు యాస్ప్రిన్ టాబ్లెట్స్ పొడి కొట్టి మీరు హెయిర్ వాష్ చేయబోయే ముందు వాటిని మీ షాంపూ లో కలిపి హెయిర్ వాష్ చేయండి.


ఆ తరువాత ప్లెయిన్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి.మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మరునాడు పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ కి పట్టించి ముప్ఫై నిమిషాలు ఉంచండి. మామూలుగా హెయిర్ వాష్ చేసేసుకోండి. నీటినీ వెనిగర్ నీ సమాన భాగాల్లో తీసుకుని స్కాల్ప్ కి అప్లై చేయండి. రాత్రంతా వదిలేసి మరునాడు పొద్దున్న మైల్డ్ బేబీ షాంపూ తో హెయిర్ వాష్ చేయండి.మామూలుగా హెయిర్ వాష్ చేసిన తరువాత ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ తో ఒక సారి హెయిర్ రిన్స్ చేయండి. ఆ తరువాత కండిషనర్ యూజ్ చేయండి.నీటినీ యాపిల్ సైడర్ వెనిగర్ నీ సమాన భాగాలుగా తీసుకుని స్ప్రే బాటిల్ లో వేసి మీ స్కాల్ప్ మీద స్ప్రే చేయండి.


ఆ తరువాత మీ తలకి ఒక టవల్ చుట్టి పదిహేను నిమిషాలు ఉంచండి. మామూలుగా హెయిర్ వాష్ చేసేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.ఒక ప్యాన్ లో గ్రీన్ టీ ఆకుల్ని పదిహేను నుమిషాలు మరిగించండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి చల్లారనివ్వండి. ఈ నీటిని మీ స్కాల్ప్ కి అప్లై చేసి ముప్ఫై నిమిషాలు ఉంచండి. హెయిర్ వాష్ చేసేయండి. ఈ మిశ్రమం తయారు చేయడానికి గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా యూజ్ చేయవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యాకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: