హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ ని శాశ్వతంగా దూరం చేసే బ్యూటీ టిప్స్..

ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రుకు ఇంకా అలాగే జుట్టు రాలే సమస్యకి చాలా మంచిది. ఎందుకంటే ఇది స్కాల్ప్‌లో pH స్థాయిని మెయింటైన్ చేస్తుంది.అలాగే ఈస్ట్‌ల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు వెనిగర్ జుట్టు కుదుళ్లను కూడా బాగా శుభ్రపరుస్తుంది.దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని రెండు టేబుల్ స్పూన్ల నీరు ఇంకా కొద్దిగా టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి జుట్టు సమస్యలు వున్న మీ తలకు బాగా మసాజ్ చేయాలి.ఇలా కొన్ని నిమిషాలు బాగా మసాజ్ చేసి, ఆ తరువాత మీ జుట్టును నీటితో బాగా శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఇంకా డాండ్రఫ్ సమస్య చాలా ఈజీగా తగ్గిపోతాయి.

ఇక బేకింగ్ సోడా అనేది చనిపోయిన కణాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే అదనపు జిగురును కూడా ఇది గ్రహిస్తుంది. ఇది స్కాల్ప్‌లో సమతుల్య pH స్థాయిని మెయింటైన్ చెయ్యడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే చుండ్రు కలిగించే శిలీంధ్రాల పెరుగుదలను కూడా బాగా తగ్గిస్తుంది. అందుకోసం మీరు ముందుగా మీ తలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత ఒక పిడికెడు బేకింగ్ సోడాను మీ తలకు పట్టించి ఒక రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఇలా కొన్ని వారాల పాటు వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ సమస్యలు దూరం అయిపోతాయి.

అలాగే వైట్ వెనిగర్ కూడా చుండ్రుకు ఇంకా హెయిర్ ఫాల్ సమస్యకు మంచి ఇంటి నివారణలలో ఒకటిని చెప్పాలి. వెనిగర్‌లో వుండే ఎసిటిక్ యాసిడ్ మీ తలపై శిలీంధ్రాల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇక అంతేగాక దురద నుండి కూడా ఇది మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకోసం ఒకటిన్నర కప్పు వైట్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. తరువాత దానితో తల ఇంకా జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక మీరు చేసినట్లయితే కచ్చితంగా మీరు మంచి ఫలితాలను చూడవచ్చు.ఖచ్చితంగా పైన పేర్కొన్న ఆ హెయిర్ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇక ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ సమస్యలు అనేవి మళ్ళీ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: