బ్లాక్ హెడ్స్ తో బాధ పడేవారికి ఓట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక ప్రసిద్ధ తృణధాన్యాలు. ఇది ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇందులో ప్రోటీన్లు, ఫాస్పరస్, విటమిన్లు ఇంకా అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గే సమయంలో కచ్చితంగా చాలా మంది ఓట్స్ ను ఆహారంలో చేర్చుకుంటారు. ఇంకా ఇది కాకుండా, వోట్స్ ఎన్నో రకాలం ఆరోగ్య ప్రయోజనాలను అందించే లక్షణాలను కలిగి ఉన్నాయి. అయితే ఓట్స్ అనేవి మీ చర్మానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుందని మీకు తెలుసా? ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే దీనితో పాటు, ఓట్స్ మీ చర్మం నుంచి డెడ్ స్కిన్ ని కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది.అందువల్ల మీకు బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఉంటే చాలా ఈజీగా తొలిగిపోతాయి. ఇంకా ఇది మాత్రమే కాదు, ఇది ముఖం పై వుండే మొటిమలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.


కాబట్టి ఓట్ మీల్ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ ఓట్ మీల్ స్క్రబ్ చేయడానికి, ముందుగా మీరు ఒక గిన్నె తీసుకోండి.ఆ తర్వాత దానికి 2 టీస్పూన్ల గ్రౌండ్ ఓట్ మీల్ ఇంకా అలాగే 1/4 టీస్పూన్ పెరుగుని కలపండి.ఇక ఆ తర్వాత ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్‌లా చేసుకోవాలి.ఇక ఇప్పుడు మీ ఓట్ మీల్ స్క్రబ్ బ్లాక్ హెడ్స్ తొలగించడానికి రెడీగా ఉంది.ఇక బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి  మీ చర్మం పై ఓట్‌మీల్ స్క్రబ్‌ని రాయండి.తర్వాత ఒక 5 నిమిషాల పాటు తేలికపాటి చేతులతో బాగా స్క్రబ్ చేయండి.ఇంకా దీని తర్వాత, కాటన్ బాల్ సహాయంతో, మీ ముఖంపై రంధ్రాలపై స్క్రబ్‌ను బాగా అప్లై చెయ్యండి.సుమారు ఒక 10 నిమిషాల తర్వాత మీరు కాటన్ ఇంకా నీటితో బాగా శుభ్రం చేసుకోండి.మంచి ఫలితాల కోసం, వారానికి కనీసం రెండుసార్లు ఈ స్క్రబ్‌ని మీరు ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: