ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకకు కారణమైన చైనాకు భారత్ భారీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ఆరోపణలు చేస్తున్నాయి. చైనా కరోనా వైరస్ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని... చైనా నుంచి భారీ మొత్తంలో నష్ట పరిహారం రాబట్టాలని డిమాండ్ చేశాయి. అయితే పలు దేశాలు చైనాపై ఆరోపణలు చేస్తున్నా భారత్ వైరస్ లీక్ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు. 
 
అయితే తాజాగా చైనాకు వ్యతిరేకంగా కరోనా వైరస్ గురించి స్వతంత్ర సంస్థచే విచారణ జరిపించాలని భారత్ తో పాటు 61 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరాయి. తాజాగా ఆల్‌ ఇండియా బార్‌ అసోషియేషన్‌ నేతృత్వంలోని న్యాయవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ (సీపీసీ)లోని సెక్షన్‌ 86ను సవరించాలని... చైనాపై పిటిషన్ వేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయాలని కోరారు. మోదీ చట్టంలో సవరణలకు అంగీకరిస్తే మాత్రం భారత్ కు చైనా భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: