పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు భారత్​ ఎల్లప్పుడూ ప్రయత్నించిందని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు సైనికులు అత్యున్నత త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు తలెత్తాయని వ్యాఖ్యానించారు.డార్జిలింగ్​, సున్కాలోని ఇండియన్ ఆర్మీ 33 కార్ప్స్​ సైనికులను ఉద్దేశించి రాజ్​నాథ్ ప్రసంగించారు. అంతకుముందు అత్యున్నత సమావేశంలో పాల్గొన్న ఆయన.. సిక్కిం సెక్టార్​లో వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాసే కార్ప్స్​ 33 యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.


బంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్​నాథ్ సింగ్ ఈ సైనిక శిబిరాన్ని శనివారం సందర్శించారు. లద్దాఖ్​లో సైనిక ప్రతిష్టంభన మధ్య ఆర్మీ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించడం సహా.. సైన్యంతో దసరా సంబరాలు చేసుకోనున్నారు రాజ్​నాథ్. సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె సైతం రాజ్​నాథ్ వెంటవచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: