జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రిలీజ్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. తెలుగు సినిమా తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని ప్రేమ‌క‌థ‌గా రాధే శ్యామ్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. కరోనావైరస్ సెకండ్ వేవ్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. అయితే, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే ఊపందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్‌లో అనూహ్యంగా పెరిగిందంట. అగ్రశ్రేణి పంపిణీదారులు ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ఇప్పటికే నిర్మాతలను సంప్రదించారంట. భారీగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు 3.5 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల మధ్య బిజినెస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: