ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేధిక‌గా విమ‌ర్ష‌లు కురిపించారు. విధ్వంసం-విద్వేషం రెండు క‌ళ్లుగా జ‌గ‌న్ రెడ్డి పాల‌న అంటూ విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ట్యాక్స్ ల‌కు అద‌నంగా జ‌గ‌న్ ట్యాక్స్ తోడ‌వ‌డంతో అన్ని రేట్లూ పెరిగాయ‌ని అన్నారు. 

బాదుడురెడ్డి దెబ్బ‌కి పెట్రోల్ ధ‌ర శుక్రవారం ద‌క్షిణాది రాష్ట్రాల‌లో సెంచ‌రీ దాటి  (రూ.101.61) నాట‌వుట్‌గా రికార్డులు సృష్టించిందని తెలిపారు. అభివృద్ధిలో అట్ట‌డుగు స్థానం, కోవిడ్ కేసుల్లో 5వ స్థానానికి చేర్చార‌ని పేర్కొన్నారు.పెట్రోల్ ధ‌ర‌ల పెంపులో సౌత్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిపారంటూ ఆరోపించారు. ఇది జ‌గ‌న్ రెడ్డి పాపం..ప్ర‌జ‌ల‌కు శాపమంటూ లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: