తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. రేవంత్ రెడ్డిని క‌లిసేంద‌కు ఆయ‌న ఇంటికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. వివిధ జిల్లాల నుంచి అభిమానులు వ‌స్తుండ‌టంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద వేదిక‌ను ఏర్పాటు చేసి కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బందులు కలుగ‌కుడా రేవంత్‌రెడ్డి ఏర్పాట్లుచేశారు.రేవంత్‌రెడ్డిని త‌న సొంత సోద‌రుడిగా భావించే ములుగు ఎమ్మెల్యే సీత‌క్క రేవంత్ ఇంటికి 100 కార్ల‌తో భారీ ర్యాలీగా బ‌య‌ల్దేరారు.రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష‌ప‌దవి రావాల‌ని ఆమె వ‌న‌దేవ‌త‌ల‌ను మొక్కుకున్నారు.నిన్న సాయంత్రం ఆమె మేడారంలో మొక్కు చెల్లించుకున్నారు.ఈ రోజు ములుగు నుంచి త‌న అనుచ‌రుల‌తో రేవంత్ ఇంటికి వ‌స్తున్నారు.దారి మ‌ధ్య‌లో సీత‌క్క వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శంచుకున్నారు.అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.వ‌న‌దేవ‌త‌ల ఆశ్వీర్వాదాల‌ను.డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ప్రేర‌ణ‌ను అందిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్ష‌లు చెప్తూ సీత‌క్క ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: