వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విశాఖ అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. 8 జోన్ లో 8 సైట్లు గుర్తించి 50 శాతం ఎంపీ నిధులు మిగతా 50 శాతం జివిఎంసి నిధులు తో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నాం అని ఆయన నేడు మాట్లాడుతూ తెలిపారు. దాతలు ఇంకా ముందుకు వస్తే మరిన్ని అభివృద్ధి కట్టడాలు చేపడతాం అని అన్నారు. విశాఖ ను అభివృద్ధి చేయటానికి సీఎం మరిన్ని ప్రణాళికలు చేస్తున్నారు అని వివరించారు.

జివిఎంసి కమిషనర్ సృజన మాట్లాడుతూ... 1000 మంది కెపాసిటీ తో కన్వెన్షన్ సెంటర్ నిర్మించటం జరుగుతుంది అని తెలిపారు. 2 కోట్లలో సగం ఎంపీ నిధులు మిగతా నిధులు జివిఎంసి నిధులతో నిర్మిస్తున్నాం అని అన్నారు. సుమారు ఒక సంవత్సరంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తాం అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క జోన్ లో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి ప్రణాళికలు చేపడుతున్నాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp