టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించిన 36 గంట‌ల దీక్ష‌కు కౌంట‌ర్‌గా వైసీపీ రేపు, ఎల్లుండి జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాబి చేసిన బూత్ కామెంట్‌కు నిర‌స‌న దీక్ష‌లు అని వైసీపీ ప్ర‌క‌టించింది. బూత్ వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు క్ష‌మాణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో రెండు రోజుల పాటు దీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. చంద్ర‌బాబు కుట్ర రాజ‌కీయాలు మానుకోవాలని, సీఎం జ‌గ‌న్ పై టీడీపీ అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండించండి అని నిర‌స‌న‌లు చేప‌ట్టారు వైసీపీ నాయ‌కులు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా బుధ‌వారం వైసీపీ నాయ‌కులు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. అక్క‌డ‌క్క‌డ టీడీపీ జెండాల‌ను త‌గుల‌బెట్టారు.

టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాబిపై విరుచుకుప‌డ్డారు. బూతులు మాట్లాడ‌డం ఏమి సంస్కారం అని ప‌లువురు ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు దీక్ష చేప‌ట్టిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైసీపీ దీక్ష‌కు పూనుకోవ‌డం ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని అమిత్ షాను కోరాడు. ఏపీలో రాజ‌కీయం ఉద్రిక్త‌త‌ను చోటు చేసుకుంటున్న‌ది. ఎప్పుడు ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఏమి మాట్లాడుతున్నాడో ఎవ‌రికి అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. అంద‌రూ అయోమ‌యానికి గుర‌వుతున్నారు. వైసీపీ, టీడీపీ మ‌ధ్య పోరు ఎప్ప‌టి దాక సాగుతుందో  చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: