తెలంగాణ రాష్ట్రంలో నిర్వ‌హించిన స్థానిక కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు తాజాగా ఫలితాలు వెలువ‌డ్డాయి. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ 6 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ది. అందులో న‌ల్ల‌గొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎంసీ కోటిరెడ్డి మాత్రం భారీ విజ‌యం సాధించారు. మిగ‌తా అభ్య‌ర్థుల కంటే ఎక్కువ‌గా మెజార్టీ ఓట్లు ద‌క్కించుకున్నారు కోటిరెడ్డి.

న‌ల్ల‌గొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండ‌గా.. అందులో చెల్ల‌ని ఓట్లు 50 ఉన్నాయి. 1,183 ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోగా.. అందులో టీఆర్ఎస్  ఎమ్మెల్సీ అభ్య‌ర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థి నగేష్‌కు 226 ఓట్లను సాధించారు. దీంతో 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి ఘ‌న విజ‌యాన్ని సాధించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి  691 ఓట్ల తేడాతో విజ‌యం సాధించిన‌ట్టు ఎన్నిక‌ల సంఘం అధికారులు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు మెద‌క్‌లో 5324, ఖ‌మ్మంలో 247 మెజార్టీతో.. ఆదిలాబాద్‌లో దండె విఠ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌లో ఎల్‌.ర‌మ‌ణ‌, భానుప్ర‌సాద్‌లు విజ‌యం సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: