హుజూరాబాద్ ఉపఎన్నిక స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మం ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా నిలిపేసిన విష‌యం విధిత‌మే. అయితే ద‌ళిత బంధు, యాసంగిలో పంట‌ల సాగు, ఉద్యోగ విభ‌జ‌న‌, క‌ల్ప‌న వంటి అంశాల‌పై  ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో బేటీ అయి క‌లెక్ట‌ర్‌ల‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు జారీ చేసారు.

త్వ‌ర‌లోనే ద‌ళిత బంధు నిధులను విడుద‌ల చేస్తాం అని  సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ద‌ళిత కుటుంబాలు ఆర్థికంగా ఎద‌గాల‌ని.. ద‌లిత కుటుంబాల‌ను ఆర్థికంగా ప‌రిపుష్టం చేయ‌డ‌మే  టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం ల‌క్ష్యం అని స్ప‌ష్టం చేసారు. ద‌ళిత బంధును హుజూరాబాద్‌, వాసాల‌మ‌ర్రి గ్రామంతో పాటు  నాలుగు మండ‌లాల ప‌రిధిలో ప్ర‌క‌టించిన విధంగానే ద‌ళిత బంధు అమ‌లు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.  అదేవిధంగా యాసంగిలో కేంద్రం వ‌డ్లు కొనక‌పోవ‌డంతో.. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండ‌వ‌ని.. కేంద్ర వైఖ‌రినీ రైతుల‌కు అర్థ‌మ‌య్యేవిధంగా చెప్పాల‌ని, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను లాభ‌సాటి దిశ‌గా రైతుల‌ను మ‌ళ్లించాల‌ని ఆ బాధ్య‌త అధికారులు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: