తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమాను సైతం కొత్త పుంతలు తొక్కించిన తెలుగు డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి కొత్త చరిత్ర లిఖించబోతున్నారా.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆయన ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటబోతున్నారా.. ఆర్ ఆర్ ఆర్‌ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి ఆస్కార్‌ అవార్డు గెలుచుకోబోతున్నారా అంటే అవునంటోంది ఓ హాలీవుడ్ మూవీ మేగజైన్‌ వెరైటీ. ఆ మేగజైన్ అంచనాల ప్రకారం ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ ఏడాది ఆస్కార్‌ బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందట.

ఇదే నిజమైతే... భారతీయ చలచ చిత్ర చరిత్రలో రాజమౌళి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకూ ఆస్కార్‌ అవార్డును చెప్పుకోదగ్గ ఏ విభాగంలోనూ గెలుచుకోలేని భారతీయ సినిమాకు రాజమౌళి బెస్ట్ డైరెక్టర్‌ అవార్డు గెలుచుకుంటే అదో ఘన విజయం అని చెప్పకతప్పదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఆస్కార్‌ గెలుచుకుంటే అది మహాద్భుతంగా చెప్పుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr