చదువును మధ్యలోనే ఆపివేయకూడదనే లక్ష్యంతోనే పెళ్లి చేసుకుంటోన్న వధూవరులు కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకు వస్తున్నామని సీఎం జగన్ చెబుతునత్నారు. దీనివల్ల తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలను పదోతరగతి చదివిస్తారని సీఎం అంటున్నారు. బాల్య వివాహాల నివారణ సహా విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు పెళ్లినాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలనే రెండో నిబంధన పెట్టినట్లు సీఎం జగన్ చెబుతున్నారు. తలిదండ్రులు చదువుకుని ఉంటే.. వారికి పుట్టే పిల్లలకూ చదువుల విలువ చెప్పే పరిస్థితి ఉంటుందని, దూరదృష్టితో, ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకువచ్చామని సీఎం చెబుతున్నారు.


పిల్లల చదువులను ప్రోత్సహించడం సహా బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేస్తోందని  సీఎం అన్నారు. మూడేళ్లుగా విద్యారంగం మీద అత్యధిక శ్రద్ధ పెట్టి, విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చామని సీఎం అన్నారు. పిల్లలకు చదువులు ఒక ఆస్తి అన్నసీఎం.. పేదరికం నుంచి పిల్లలు బయటపడే ఏకైక అస్త్రం చదువు మాత్రమే అన్నారు. వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకం తో మరో గొప్ప అడుగు వేస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: