వచ్చే ఎన్నికల్లో కొందరు నేతలు తాము పోటీ చేసే స్థానాలు మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ కొన్ని మార్పులు చేసింది. అయితే.. దీనిపై టీడీపీ విమర్శలు చేసింది. దాన్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. చంద్రగిరి, మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్‌కు మిగిలేది శంకరిగిరి మాన్యాలేన‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అంటున్నారు.  చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నార‌ని అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు.  మీరు మాత్రం  ఇష్టమొచ్చినట్లు పోటీ చేయొచ్చా అని అంబ‌టి రాంబాబు విమర్శించారు.

పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్ల మార్పులు జరుగుతున్నాయ‌ని అంబ‌టి రాంబాబు చెప్పారు. ఇప్పుడు 175 సీట్లు గెలవడమే తమ టార్గెట్‌ అని.. మా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు చేరాయ‌ని అంబ‌టి రాంబాబు స్పష్టం చేశారు. 60 శాతంపైగా  ప్రజలు వైయ‌స్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని అంబ‌టి రాంబాబు తెలిపారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌లో అరంగేట్రం చేశారని.. అసలు అసలు ఈసారి  కుప్పంలో పోటీ చేస్తారా.. అని అంబ‌టి రాంబాబు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: