తెలుగు వారికి అతి పెద్ద పండుగగా సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రులంతా సంక్రాంతికి తమ తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. పిండి వంటలు, ఆటల పోటీలు, కోళ్ల పందేలు.. ఇలా పల్లెలన్నీ కళకళలాడుతాయి. అలాగే ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలకు కూడా సంక్రాంతి ‘పెద్ద పండుగ’గా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిప్పే బస్సుల వల్ల భారీ లాభాలు గడిస్తుంటారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు స్పెషల్ విమానాలు నడిపేందుకు ఎయిర్‌వేస్ రెడీ అయిపోయాయి.


హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కేవలం గంటలోనే విజయవాడ చేరిపోవచ్చు. జనవరి 10 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి.. 5.30 కల్లా విజయవాడకు విమానం చేరుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయల్దేరే విమానం రాత్రి 7.10కి హైదరాబాద్‌కు చేరుతుంది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉన్నాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్‌ విమాన సంస్థ విడుదల చేసింది.



జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి 5.30కు విజయవాడకు వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటకు ఇదే సర్వీసు బయల్దేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది. జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతి రోజు మధ్యాహ్నం 3.20కు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది. ఇది జనవరి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఇక, జనవరి 11 నుంచి 28వ తేదీ వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయల్దేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: