భారతీయులు క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్ వైపు మొగ్గుతున్నారు. ఇప్పటివరకు మాన్యువల్‌గా గేర్లు మార్చే కార్లకు అలవాటుపడినవారు నెమ్మదిగా ఆటోమేటిక్ గేర్లు కలిగిన కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రారంభ మోడల్‌లో చిన్న కార్లు కూడా ఆటోమేటిక్ గేర్లు ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో దాదాపు ఎక్కువ మోడళ్లు ఈ సిస్టమ్‌వైపే మారే అవకాశం కనపడుతోంది. 2019లో దేశంలో అమ్ముడైన కార్లలో 17.3 శాతం ఆటో ట్రాన్స్‌మిషన్‌వే ఉన్నాయి. గేర్లు మార్చే పని తప్పడంతో కేవలం రోడ్డుపై దృష్టి పెట్టవచ్చని అందరూ ఈ తరహా కార్లవైపు మొగ్గుచూపుతున్నారు.ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ టెక్నాలజీ నాణ్యంగా ఉండటంతోపాటు రోజురోజుకూ దాని సాంకేతికత మరింత పెరుగుతోంది. గతంలో ఖరీదైన కార్లు మాత్రమే ఆటోమేటిక్ గేర్లను ఇస్తుండేవి. ధరలు తగ్గడంతో చిన్నకార్లు కూడా ఆటోమేటిక్ గేర్లున్నవే ఇవ్వడంతోపాటు డీజిల్ ఇంజిన్ కార్లలో కూడా ఇస్తున్నాయి. ఒకప్పుడు విలాసవంతమైనది.. ఇప్పుడు సాధారణమైపోయింది.
ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్లుంటే..
చేతితో గేర్లు మార్చకుండా ప్రయాణించేలా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. కంప్యూటర్ చిప్‌లు ఆటోమేటిక్‌గా కారు వేగాన్ని బట్టి గేర్లను మారుస్తుంటాయి. పట్టణాల్లో బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసే సమయంలో ఇది మంచి ప్రయోజనకారి. ఆటో ట్రాన్స్‌మిషన్‌లో అనేకరకాల సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అన్ని కంపెనీలు ఒకేరకమైన సాంకేతికతను ఉపయోగించవు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో మాయమవుతోంది. విక్రయించే మోడళ్లలో మాన్యువల్ కార్ల శాతం వందకు పదమూడుగా ఉంది. 2011లో అయితే మూడోవంతుకు పైగా మోడళ్లలో మాన్యువల్ పద్ధతి అందుబాటులో ఉండేది.
విద్యుత్తు కార్లు అందుబాటులోకి వస్తే..
భవిష్యత్తులో విద్యుత్తు కార్లు వస్తే వాటికి ఇంజిన్లు ఉండవు కాబట్టి గేర్లు అవసరంలేదు. టెస్లా కంపెనీ తయారుచేసే కార్లు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు భారత్లో వీటికి మార్కెట్ లేనప్పటికీ భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉంది. 2030 చివరినాటికి భారతదేశంలో ఎక్కువగా విద్యుత్తుకార్లే విక్రయమయ్యే అవకాశం కనపడుతోంది. మారుతీ సుజుకీ కార్ల మోడళ్లలో 30 శాతం ఆటోమేటిక్‌వే అమ్మకాలు జరుగుతున్నాయి. టాటామోటార్స్ 14శాతం వరకు విక్రయిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి