హైదరాబాద్ బిర్యానీ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ఫేమస్. ఈ బిర్యానీ ప్రస్తుతం దేశంలోని మంచి పేరు సంపాదించింది. అలాంటి బిర్యానీ ఇప్పుడు హైదరాబాదులో రికార్డులు సృష్టించింది. ఏంటో తెలుసుకుందామా..?
ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా బిర్యానీ అంటే చాలు నోరూరాల్సిందే. కరోనా టైం లోనూ ఇదే డిమాండ్ వెల్లువెత్తిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిమిషానికి 115 బిర్యానీ ప్లేట్లకు ఆర్డర్ వచ్చిందంటేనే బిర్యాని దమ్మేంటో అర్థమవుతుంది. గతేడాదే కాదు ఈ ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ పెట్టింది బిర్యానీనేనట. 2021లో ఆన్లైన్ లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ డిష్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గి రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్  తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గి వెల్లడించింది. ఆరవ వార్షిక నివేదిక స్టేటిస్టిక్స్ రిపోర్టులో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గి లో  చేరినట్లు కంపెనీ ప్రకటించింది.


వీరి మొదటి ఆర్డర్ గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గి వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్ గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసాలు ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గి పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశం జనాభాతో సమానం. ఏడాది పొడవునా ఒక సెకండ్ లో సుమారు రెండు బిర్యానీ లను ఆర్డర్ చేస్తున్నట్లు  పేర్కొంది. చికెన్ బిర్యానీ,సమోసాల తర్వాత, చికెన్ వింగ్స్,పావుభాజీ లు నిలిచాయి. ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ గా పావుబాజీ నిలిచింది. స్వీట్స్ లో 21 లక్షల ఆర్డర్స్ గులాబ్ జామ్ నిలవగా, తర్వాత స్థానంలో రసమలై  నిలిచింది. అయితే కరోనా రాకతో చాలామంది హెల్త్ డైట్ పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గి లో హెల్త్ డైట్ ను వెతికిన వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యంత ఆరోగ్యకరమైన నగరంగా మొదటి స్థానంలో బెంగళూరు నిలువగా తర్వాత స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి.

ఈ సర్వేలు అంశాలవారీగా దేశవ్యాప్తంగా ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, నగరాల వారీగా టాప్ 5 ఆర్డర్ల వివరాలను స్విగ్గి విశ్లేషించింది. హైదరాబాదులో మాంసాహారాన్ని మరీ ముఖ్యంగా చికెన్ తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన బిర్యానీకి ఎప్పటిలాగే సిటిజన్లు జై కొడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ లలో చికెన్ బిర్యాని మొదటి స్థానంలో ఉండగా చికెన్65 రెండో స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ కు మంచి డిమాండ్ వుంది. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఆన్లైన్ ఆధారిత ఆప్ లతో కస్టమర్లు ఫుడ్డును ఆస్వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: