ఇక మీ వద్ద రేషన్ కార్డ్ ఉన్నట్లయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్ ప్రభుత్వం అందించింది. ఈ నెల నుండి తెలంగాణా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణి ప్రారంభిస్తునట్లు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిష్టర్ గంగుల కమలాకర్ వెల్లడించారు.అలాగే ఈ రేషన్ కార్డ్ లిమిట్ తో పనిలేకుండా ఒక్కొక్కరికి కూడా మొత్తం 10 కిలోల చొప్పున రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యాన్ని పంపిణి చేస్తామని కూడా వారు ప్రకటించారు. ఇక ఈ 10 కిలోల ఉచిత రేషన్ పంపిణీ జూన్ నుండి డిసెంబర్ నెల వరకూ కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.ఇక మీరు మీ రేషన్ కార్డ్ ను ఉపయోగించి దేశంలో ఏ ప్రాంతం నుండైనా కానీ మీ రేషన్ తీసుకునే అవకాసాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీకు అందించింది. అలాగే దీని కోసం, మీకు తగిన సహాయాన్ని కూడా అందించడానికి ఉపయోగపడేలా మేరా రేషన్ యాప్ ను కూడా అందించింది. ఇక దీని ద్వారా మీ దగ్గరలోని రేషన్ షాప్ వివరాలను మీ స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా రేషన్ కార్డు ధారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు.


ఇక అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ ఇంకా దాని వివరాలను కూడా పొందవచ్చు. మేరా రేషన్ యాప్ పేరుతో వచ్చిన ఈ యాప్ అనేది రేషన్ కార్డు లబ్ధిదారులకు వరంలా మారుతుంది.రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది.మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది. ఇంకా దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను కూడా తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. UMANG లో ఈ యాప్ సర్వీస్ లన్ని కూడా లభిస్తున్నాయి. కాబట్టి, మీ వద్ద UMANG App వున్నా కూడా ఈ యాప్ అందించే లాభాలను మీరు ఈజీగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: