
ఇటీవల ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో కంపెనీ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలివిగా ఆలోచించిన జొమాటో మేనేజ్‌మెంట్ మరోసారి ప్లాట్‌ఫార్మ్ ఫీజును 20% పెంచింది. దీంతో వినియోగదారులు ఇప్పుడు జొమాటోలో ఏదైనా ఆర్డర్ చేస్తే అదనంగా రూ.12 ప్లాట్‌ఫార్మ్ ఫీజు చెల్లించాలి. అంతకు ముందు ఇది రూ.10గా ఉండేది. వినాయక చవితి అయిపోయింది, ఇక వరుసగా పండగల సీజన్ రాబోతోంది. ఈ సీజన్‌లో భారీ డిమాండ్ ఉంటుందని ముందే గ్రహించిన జొమాటో, లాభాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఫీజులు పెంచింది అంటున్నారు జనాలు.
ఒక్కో ఆర్డర్‌పై రూ.2 పెంపు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మొత్తం లెక్కేస్తే మాత్రం జొమాటోకు లక్షల్లోనే అదనపు ఆదాయం వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. జొమాటో, స్విగ్గీ వంటివి రోజుకు సగటుగా 25 లక్షల పైగా ఆర్డర్లు డెలివరీ చేస్తాయి. అంటే ఒక్కో ఆర్డర్‌పై రూ.2 పెంచితే రోజుకే అదనంగా రూ.50 లక్షల కంటే ఎక్కువ లాభం వస్తుంది. ఈ డబ్బు నేరుగా కంపెనీకే వెళుతుంది. ఇక మొత్తం రూ.12 ప్లాట్‌ఫార్మ్ ఫీజుతో రోజుకు సుమారు రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పండగల సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా బిజినెస్ మైండ్‌సెట్‌తో చేసిన నిర్ణయం. ఈ మార్కెటింగ్ ఐడియాతో జొమాటో, స్విగ్గీ లాంటి దిగ్గజ డెలివరీ యాప్స్ కోట్లలో లాభాలు సంపాదించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.