ఒకప్పుడైతే పెళ్లి చేసుకోవాలంటే ముందుగా పెళ్లిచూపులు చూసే వారు ఒకరిని ఒకరు వెళ్లి అన్ని లాంఛనాలను మాట్లాడుకునేవారు. కానీ నేటి రోజుల్లో పెళ్లి అంటే పూర్తిగా ఆన్లైన్ మయం అయిపోయింది. పెళ్లిచూపులు ఇక మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానే జరుగుతున్నాయి. మాట్రిమోనీ సైట్లలో ఇక ఉద్యోగం వ్యాపారం  అన్ని రకాల వివరాలను పొందు పరచడం ఆ వివరాలను చూసిన వారు పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.. అయితే నేటి రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్ లలో ఎన్నో మోసాలు కూడా బయట పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఎంతోమంది మ్యాట్రిమోనీ సైట్ లో తప్పుడు వివరాలను పెట్టి ఎంతో మంది అమాయకులను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఇక్కడ ఇలాంటిదే ఘటనే జరిగింది. మాట్రిమోని సైట్ లో పరిచయమైన ఒక ఐపీఎస్కు షాక్ ఇచ్చింది యువతీ.  జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ మహిళ తన కూతురు వివరాలను ఒక మాట్రిమోనీ సైట్ లో పొందుపరిచింది. ఈ క్రమంలోనే ఆ యువతి వివరాలను చూసినా హరి ప్రసాద్ అనే వ్యక్తి ఇక ఆ యువతి తో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఐపీఎస్ గా పని చేస్తున్నానని హోంమంత్రిత్వ శాఖలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నా అంటూ చెప్పాడు.



 కానీ ఆ యువతి ఆ ఐపీఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది.. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఐపీఎస్ అంటూ బిల్డప్ ఇచ్చిన వ్యక్తి అసలు ఐపిఎస్ కాదు. ఇక ఇదే విషయంలో అనుమానం వచ్చిన యువతీ ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలి అంటూ కోరింది.  ఇక అతను సర్టిఫికెట్లు ఆ యువతికి పంపించగా మరింత అనుమానం వచ్చిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: