తెలుగు సినీ పరిశ్రమ లో మంచి క్రేజ్ కలిగిన నటనలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే పక్కా కమర్షియల్ సినిమా లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూ వీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది . ఈ మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ తన కెరియర్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే రవితేజ , శ్రీ లీల కాంబినేషన్లో రూపొందిన ధమాకా సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో మాస్ జాతర సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని రవితేజ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా విడుదల తేదీలను ఈ మూవీ బృందం గతంలో ప్రకటించింది.

కానీ అనేక సార్లు ఈ సినిమా వాయిదా పడింది. కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులే ఉన్న ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త ప్రేక్షకులను నిరాశ పరిచిన ప్రమోషన్ల విషయంలో మాత్రం అస్సలు నిరాశ పరచడం లేదు. ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూ లో కూడా పాల్గొంది. అలాగే వరుస పెట్టి ఈ మూవీ యూనిట్ ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస అపజయాతో రవితేజ కెరీర్ను కొనసాగిస్తున్నాడు. మరి ఆయనకు మాస్ జాతర సినిమాతో మంచి విజయం దక్కుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt