నేటి ఆధునిక సమాజంలో మనిషి పూర్తిగా మారిపోయాడు అని చెప్పాలి. ఎంతలా అంటే ఏకంగా మానవ బంధాలకు కూడా విలువలు ఇవ్వలేనంతగా మనిషిలో మార్పు వచ్చింది. అందుకే కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తరలింపుతూ నీచమైన పనులు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజులో హత్యలు ఆత్మహత్యలు లాంటి ఘటనలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తున్న తర్వాత కూడా ఎవరిలో మార్పు రావడం లేదు.


 అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ అలాంటి నీచమైన పనులు చేయడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే ముంబైలోని బంధు పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని భర్త, తన తమ్ముడు, మరో స్నేహితుడితో కలిసి దారుణంగా హతమార్చాడు అని చెప్పాలి. బంధు ఏరియాలో అవినాష్ అనే 30 ఏళ్ల వ్యక్తి తన భార్య తమ్ముడు అశ్విన్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో  సివిల్ ఇంజనీర్ గా పనిచేసే సూరజ్ స్నేహితుడు అయ్యాడు. అయితే గత కొంతకాలం క్రితం అవినాష్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి సూరజ్ కూడా వచ్చాడు. ఆ సమయంలోనే అవినాష్ భార్యతో సూరజ్ కి పరిచయం ఏర్పడింది.  పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అవినాష్ స్నేహితుని పలుమార్లు మందరించాడు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాలేదు.  ఈ క్రమంలోనే తమ్ముడు అశ్విన్ అతని స్నేహితుడితో కలిసి సూరజ్ ను దారుణంగా హత్య చేశారు అవినాష్. ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడ్డగా అసలు విషయం బయటపడింది. దీంతో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: