
ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. ఏకంగా నగల దుకాణంలో పట్టపగలే 69 గ్రాముల నగలు చోరీకి గురైన ఘటన పూణేలో కలకాలం సృష్టించింది అని చెప్పాలి. కస్టమర్ లాగా షాప్ లోకి వచ్చిన ఒక దొంగ ఏకంగా ఐదు లక్షల విలువైన నగలను దోచుకుని వెళ్ళాడు. కడక్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనానికి సంబంధించి కేసు నమోదు అయింది అని చెప్పాలి. పూణేలోని భవానిపేటలో గల నగల దుకాణంలో సాయంత్రం ఒక వ్యక్తి కస్టమర్ గా వచ్చాడు. అయితే మొదట షాప్ లో ఒక గ్రాము బంగారం కొన్నాడు. తర్వాత మరికొన్ని ఆభరణాలు చూపించాలని కోరాడు.
ఈ క్రమంలోనే 69 గ్రాముల బరువున్న ఆభరణాలను అతనికి చూపించాడు దుకాణదారుడు. ఆ తర్వాత ఆ దొంగ బయటికి వెళ్ళాడు. ఇక కొన్ని రాళ్లను తన జేబులో వేసుకుని అనంతరం లోపలికి వచ్చి.. దుకాణదారుడు దృష్టిని మరల్చి నగల పౌచ్ లో చిన్న రాళ్లను పెట్టి తర్వాత నగలను జేబులో వేసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. దొంగ వెళ్లిపోయిన తర్వాత గమనించిన దుకాణదారుడు.. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.