చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి రావడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పాలి. కానీ సినిమాల్లో చూపించినట్లుగానే నిజజీవితంలో కూడా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడని భావించి ఇక ఎంతోమంది బురిడీ బాబాల మాయలో పడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక చనిపోయిన వారిని మళ్లీ వెనక్కి తిరిగి తెచ్చుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం లేదా పూజలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అన్న వార్తలు కూడా ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొన్నాళ్లపాటు తమ కుటుంబంలో ఒకడైన వ్యక్తి కనిపించకపోవడం.. ఇక అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి ఏదో ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఇక తమ కుటుంబీకుడే చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయడం.. కానీ ఆ తర్వాత అసలు వ్యక్తి తిరిగి రావడం లాంటి ఘటనలు కూడా ఇటీవల వెలుగు చేశాయ్. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన జరిగింది అని చెప్పాలి. పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించిన బాలుడు పాతికేళ్ల వయసులో మళ్ళీ తిరిగి వచ్చాడు.


 ఉత్తరప్రదేశ్ లోని దివరియా జిల్లా భాగల్పూర్ బ్లాకులో ఈ ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. మురాసో గ్రామానికి చెందిన అంగెష్ యాదవ్ 15 ఏళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. దీంతో సాంప్రదాయం ప్రకారం అతడిని అరటి బొందెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టారు. కానీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. పాము కాటు తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. తిరిగి మేలుకువ వచ్చేసరికి బీహార్ రాజధాని పాట్నాలో పాములు పట్టే వ్యక్తి నాకు చికిత్స అందిస్తున్నాడు. అతడే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఇక ఓ లారీ డ్రైవర్ కు తన గురించి చెప్తే అతనే ఇప్పుడు అజంగడ్ తీసుకొచ్చి విడిచి పెట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: