తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఆ గురువులే విద్యార్థుల పాలిట శాపంగా మారిపోతున్నారు అని చెప్పాలి. తల్లితండ్రులు గారాబంగా పెంచుకుంటున్న తమ పిల్లలను ప్రయోజకులను చేస్తారు అనే నమ్మకంతో అటు స్కూళ్లు, కాలేజీలకు పంపిస్తూ ఉంటారు. కానీ అటు ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సింది  పోయి ఇక చెడుదోవ పట్టేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా కొంతమంది అయితే కన్న బిడ్డల్లా చూసుకోవలసిన విద్యార్థులను దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక మరి కొంతమంది.. విద్యార్థులు బాగా చదువుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా అన్ని బాధ్యతలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు చెడదోవ పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేసింది. ఏకంగా మైనారిటీ గురుకుల కళాశాలలో ఒక బాలిక ప్రసవించడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. గురుకుల కళాశాల బాత్రూంలో బాలిక బిడ్డకు జన్మనిచ్చింది.


 నారాయణఖేడ్ మైనారిటీ గురుకుల కళాశాలలో బాలిక ప్రసవించడం ఘటన సంచలనగా మారిపోవడంతో చివరికి ప్రిన్సిపల్ మంజులను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గత నెల 24న ప్రథమ సంవత్సర విద్యార్థి బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయాన్ని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇక ప్రిన్సిపల్ మంజులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక డిప్యూటీ వార్డెన్ తో పాటు స్టాఫ్ నర్స్ పై టెర్మినేట్ విధించారు అధికారులు. అయితే ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అఅయితే ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: