బిర్యానీకి పుట్టింది పేరు ‘హైదరాబాద్’. భోజన ప్రియులను ఎల్లప్పుడు ఆకట్టుకునేందుకు రకరకాల వంటకాలు రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి. స్పెషల్లీ బిర్యానీ లవర్స్‌ కి. ఇప్పటికే ఎన్నో వైరటీలు ఉన్న బిర్యానీలో ఈ రోజు మనం నోరూరించే ‘రొయ్యల బిర్యానీ’ గురించి తెలుసుకుందాం. ఘుమ ఘుమలాడే వాసనతో భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది రొయ్యల బిర్యానీ.


రొయ్యల బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు..

బాస్మతి రైస్- కేజీ, రొయ్యలు- కేజీన్నర, గరం మసాలా- ఇరవై గ్రాములు, పెరుగు- రెండు వందల గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 100 గ్రాములు, నూనె- 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, ఉల్లి ముక్కలు (వేయించినవి)- 30 గ్రాములు, బిర్యానీ ఆకులు- 5 గ్రాములు, నెయ్యి- 150 గ్రాములు, జీడిపప్పు- కొద్దిగా, పుదీనా, కొత్తిమీర తురుము- 30 గ్రాములు, మంచి నీళ్లు- 5 లీటర్లు.


తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రొయ్యలు తీసుకోవాలి. అందులో.. నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, నూనె వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.


ఆ తర్వాత స్టవ్‌పై ఒక బౌల్‌లో నీళ్లు పోసి అందులో బిర్యానీ ఆకులు, గరం మసాలా వేసుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో బాస్మతి రైస్ వేసుకోవాలి. బియ్యం సగం వరకు ఉడికాక అందులోని నీరు బయటకు తీసివేయాలి.


ఆ తర్వాత ఒక పెద్ద బిర్యానీ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన రొయ్యల్ని వేసుకోవాలి. దానిపై బాస్మతి రైస్ పొరలా వేసుకోవాలి. నెయ్యి, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లి వేసి మూత కప్పేయాలి. లో ఫ్లేమ్‌లో 25 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే రొయ్యల బిర్యానీ రెడీ. వేడి వేడి రొయ్యల బిర్యానీని రైతాతో కలిపి లాగించేయండి. రొయ్యల బిర్యానీ తయారీ విధానం తెలుసుకున్నారుగా.. మీరు ట్రై చేసినప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: