ఇందుకోసం 5 వేల కోట్ల రూపాయల చెల్లించనున్నట్లు గా తెలిపాడు. కొంత కాలంగా పరిచయం ఉండడంతో వైద్యులు అతని మాటలు నమ్మింది. దీంతో మెస్సి గేమ్ స్టార్ట్ చేశాడు.ఆమెకు మరింత నమ్మకం కలిగేలా ఒక అకౌంటుకు చెందినటువంటి డెబిట్ కార్డు కూడా పంపాడు. అందులో నుంచి ఆ వైద్యురాలు నాలుగు వేలు డ్రా చేశాడు.. తర్వాత ఆయన ఢిల్లీ కస్టమ్స్ అధికారుల పేరుతో వైద్యురాలికి ఫోన్ చేశాడు. మీకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలు తీసుకోవాలని చెప్పాడు. దీనికోసం డబ్బులు చెల్లించాలని ఆమెకు నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన డాక్టర్ పలు దఫాలుగా 20 లక్షల రూపాయలు వాళ్లు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మెస్సి తన కుమార్తె చనిపోయిందని నాటకమాడి మరో ఇరవై ఒక్క లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. డాక్టర్ ఇంకా డబ్బులు పంపుతూనే ఉన్నారు. దీంతో వైద్యురాలి కూతురికి అనుమానం రావడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి